పౌరసరఫరాల శాఖ కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జిఎంఆర్

20-11-2026 | 03:03pm

రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు

డీలర్ల సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి 

పటాన్ చెరు: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ(State Civil Supplies Department) నూతన కమిషనర్ గా ఇటీవల నియమితులైన నాగిరెడ్డిని పటాన్ చెరు ఎమ్మెల్యే తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) నేతృత్వంలోని డీలర్ల సంక్షేమ సంఘం(Dealers' Welfare Association) సభ్యులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు.

ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీలర్లకు గౌరవ వేతనం, క్వింటాలుకు 300 రూపాయల కమిషన్, ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ వే బ్రిడ్జిల ఏర్పాటు, 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, తదితర అంశాలను అమలు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన నాగిరెడ్డి.. ప్రభుత్వంతో చర్చించి డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, రాష్ట్ర ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు