మండల వార్డు మెంబర్స్ ఫోరం కమిటీ ఎన్నిక

07-11-2026 | 08:18pm

అధ్యక్షురాలిగా కంతుల శిరీష స్వామి.. ప్రధాన కార్యదర్శిగా గుర్రం రాజశేఖర్ రెడ్డి

సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండల వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీని తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు మొక్కపల్లి అనిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దె రాజు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.

మండల అధ్యక్షురాలిగా రాఘవపూర్‌కు చెందిన కంతుల శిరీష స్వామి, గౌరవ అధ్యక్షుడిగా పుల్లూరుకు చెందిన మోలుగు యాదగిరి, ప్రధాన కార్యదర్శులుగా సీతారాంపల్లికి చెందిన గుర్రం రాజశేఖర్ రెడ్డి, చిన్నగుండవెల్లికి చెందిన కోటగిరి హరీష్ ఎంపికయ్యారు. 

ఉపాధ్యక్షులుగా గ్యార రత్నమ్మ, శంకర్, దుర్గం రవికుమార్, పోతరాజు స్వామి, కార్యదర్శులుగా రేణిగుంట శ్రీనివాస్, మన్నె అనురాధ గిరి, గ్యార నీరజ, కుమారస్వామి, గాంధ్యడాపు రాజేందర్, కార్యవర్గ సభ్యులుగా పొన్నాల లావణ్య, దుర్గం తిరుపతి, జంగు మల్లేశం తదితరులు ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు