మల్లన్న సాగర్ కట్టపై ర్యాంపు నిర్మించాలని వినతి

04-11-2026 | 05:56pm

కొండపాక, అక్టోబర్ 4: కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలోని మల్లన్న సాగర్ కట్టపై(Mallanna Sagar embankment) ర్యాంపు నిర్మించాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌కు(Principal Secretary Naveen Mittal) గ్రామ సర్పంచ్ ఆకుల భద్రప్ప ఆధ్వర్యంలో గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు.

మల్లన్న సాగర్ నిర్మాణంలో గ్రామస్థులు భూములు కోల్పోయినందున, ర్యాంపు నిర్మిస్తే పర్యాటకుల రాక పెరిగి గ్రామంలోని చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈసాల నవీన్, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షుడు కోరే చరణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు