ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వై. తిరుపతిరావుకు అభినందనలు
ముకరంపుర, నవంబరు 4 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న వై. తిరుపతిరావుకు( Y. Tirupathi Rao) జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ(District Collector, District Education Department) అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన సందర్భంగా టీఎన్జీవో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగం లక్ష్మణరావు ఆధ్వర్యంలో నాయకులు తిరుపతిరావు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి, టీఎన్జీవోల డైరీని బహూకరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల కేంద్ర సంఘ నాయకులు సర్దార్ హర్మిన్దర్ సింగ్, రాగి శ్రీనివాస్, రాజేష్ భరద్వాజ్, లవకుమార్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.