108 చీరలతో కనకదుర్గమ్మకు విశేష అలంకరణ..

14-10-2026 | 07:32pm

మహా చండీదేవిగా అమ్మవారి దర్శనం..

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం(Sri Kanaka Durga Temple)లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం అమ్మవారు శ్రీ మహా చండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 108 రకాల చీరలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అల్లం గారెలు, పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించారు. 108 చీరలను అందజేసిన దుబ్బాక మహేందర్ రెడ్డి–మాధవి దంపతులను ఆలయ కమిటీ అభినందించింది. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు.

ఆలయ ఛైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ నేతృత్వంలో అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పూజాదికాలు నిర్వహించారు. పలువురు ఆలయ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రముఖుల దర్శనం: మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీత రమేష్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పందిరి శ్రీనివాసులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తేరటుపల్లి హనుమంతు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

మరిన్ని వార్తలు