ఎమ్ ఎల్ సీ ఓటరు నమోదు వేగవంతం చేయండి...

14-10-2026 | 07:31pm

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరియు జిల్లా పార్టీ ఇంచార్జీ బద్దం మహిపాల్ రెడ్డి

కూసుమంచి, అక్టోబర్ 14(విజయక్రాంతి): కూసుమంచి మండల కేంద్రంలో జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి విన్నపం మేరకు వారి స్వగృహం కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా ఇంచార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి(Baddam Mahipal Reddy) భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర రావు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రేఖ సత్యనారాయణ యాదవ్ కలసి రావడం జరిగింది.

ఈ సందర్భంగా బద్దం మహిపాల్ రెడ్డి  మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్ ఎల్ సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ లో పాల్గొని ఓటరు నమోదు చేయించాలని తెలియచేయడం జరిగింది.  అదేవిధంగా అనునిత్యం ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా పని చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సూచనలు ఇవ్వడం జరిగింది. అందరూ మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవాలి:

పాత ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు కూడా మళ్ళీ  అవ్వాలి అని లేకపోతే 2027 ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉండదు అని, 2023 లేదా అంతకంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు అని తెలియ చేశారు. ఈ

కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షురాలు చందబోయిన పుణ్యవతి, కొత్త శ్రీనివాస్ రెడ్డి,మంద నవ్య, మంద చంద్రశేఖర్ గౌడ్, సోమనపల్లి వెంకన్న,పిట్టల వేణు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు