పోటీనే లేదు.. ఐసీసీ పగ్గాలు మళ్లీ జై షాకే!

16-11-2026 | 11:37am

అంతర్జాతీయ క్రికెట్‌లో జై షా ఆధిపత్యం.. మరోసారి ఛైర్మన్‌గా!

బాలి: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ బోర్డు ప్రభావం మరోసారి చాటుకుంది. International Cricket Council (ICC) ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆదివారం ముగిసిన ఐసీసీ Board Meetingsలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. 38 ఏళ్ల జై షా నాయకత్వంపై ఐసీసీ బోర్డు పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. ఎలాంటి పోటీ లేకుండా ఆయనను మరోసారి ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. 2024 డిసెంబర్‌లో తొలిసారి ఈ బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఇప్పుడు రెండోసారి అవకాశం దక్కింది. క్రీడలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న సమయంలో ఆయన కొనసాగింపు అవసరమని ఐసీసీ అభిప్రాయపడింది.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణే లక్ష్యం!

క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరించడం, అభిమానుల సంఖ్య పెంచడం, Commercial Developmentకు కొత్త అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ఐసీసీ భవిష్యత్ కార్యాచరణలో కీలకంగా ఉండనున్నాయి. ఈ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు జై షా నాయకత్వం కొనసాగడం ఉపయోగపడుతుందని ఐసీసీ పేర్కొంది.

బీసీసీఐ నుంచి ఐసీసీ వరకు..

గతంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శిగా పనిచేసిన జై షా.. 2024లో ఐసీసీ పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు రెండోసారి బాధ్యతలు దక్కించుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన పాత్ర మరింత కీలకంగా మారనుంది. రాబోయే రెండేళ్లలో ప్రపంచ క్రికెట్ విస్తరణ, కొత్త మార్కెట్ల అభివృద్ధి, అభిమానుల ఆదరణ పెంపుపై ఆయన నాయకత్వంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు