అక్టోబర్ 30, 31న స్కంద ట్రై స్పోర్ట్స్ చాంపియన్‌షిప్

30-09-2026 | 05:10am

హైదరాబాద్, సెప్టెంబర్ 28 : హైదరాబాద్ స్కంద ఇంటర్నేషనల్ స్కూల్(Hyderabad Skanda International School) ఆతిథ్య మిస్తున్న ప్రతిష్టాత్మక ‘స్కంద ట్రై స్పోర్ట్స్ చాంపియన్‌షిప్(Skanda Tri Sports Championship) 2026’ వచ్చే నెల అనగా అక్టోబర్ 30, 31 తేదీలలో ఘనంగా జరగనుంది. ఈ టోర్నమెంట్‌ను ప్రముఖ క్రీడా సంస్థ ‘సెవెన్ హెచ్‌స్పోర్ట్స్(Seven HSports)’ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక వాల్‌పోస్టర్(Wallposter)ను పాఠశాల ప్రిన్సిపాల్, స్కూల్ మేనేజ్ మెంట్ బృందం కలిసి ఆవిష్కరించారు. రెం డు రోజుల పాటు సాగే ఈ క్రీడా సంబరాలలో అథ్లెటిక్స్, చెస్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో పోటీలు ఉంటాయి.

అండర్-7 నుంచి అండ ర్-17 వయోవిభాగాల లోపు ఉన్న పాఠశాల స్థాయి బాలబాలికలు ఎవరైనా ఈ పోటీల లో పాల్గొనడానికి అర్హులు. ఈ సందర్భంగా 7హెచ్ స్పోర్ట్స్ ఫౌండర్ వెంకటేశ్ మాట్లాడు తూ, పాఠశాల స్థాయినుంచే విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో స్కంద ఇంటర్నేషనల్ స్కూల్‌తో చేతు లు కలిపి ఈ లీగ్‌ను డిజైన్ చేసినట్లు తెలిపా రు. ఆసక్తి గల విద్యార్థులు ఈ ఈవెంట్ కో సం  పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు