కరీంనగర్, సిరిసిల్లలో నేడు సీఎం పర్యటన
- కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం
- సిరిసిల్లలో రోడ్ షో, భారీ బహిరంగ సభ
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కరీంనగర్, సెప్టెంబరు 29(విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి()CM Revanth Reddy బుధవారం కరీంనగర్(Karimnagar), సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికా రులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ చేరుకొని పాత కలెక్టరేట్ ప్రాంగణం(Collectorate premises)లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. 3.10కు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ(Telangana Thalli statue unveiling) చేస్తారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి 4.25 వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా సిరిసిల్ల చేరుకుంటారు.
సిరిసిల్ల పట్టణంలో సాయంత్రం 5గంటల నుంచి గంటపాటు దాదాపు 4 కిలోమీటర్ల మేర సాగే రోడ్ షోలో పాల్గొంటారు. 6 గంటలకు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సుమారు 345.78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శం కుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చేనేత, పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం నే తన్న బజార్ ప్రారంభించనున్నారు. సిరిసిల్ల, వేములవాడలలో 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడె న్షియల్ పాఠశాలలకు శంకుస్థాపన చేస్తారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ(Rajarajeshwara Swamy Temple) అభివృద్ధి కోసం 99.40 కోట్ల పనులకు పునాది రాయి వేస్తారు. రెండు కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్నారు. తర్వాత సిరి సిల్ల పట్టణ శివార్లలోని రగుడు బైపాస్ రోడ్డు మై దానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ లో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం హోదా లో సిరిసిల్ల జిల్లాకు ఆయన రావడం ఇదే తొలిసారి.