హైకోర్టులో టీసీఏకు స్వతంత్ర విచారణ మంజూరు
హైదరాబాద్, సెప్టెంబర్ 29 : తెలంగాణ క్రికెట్(Telangana Cricket) పరిపాలనా సంస్కరణల చరిత్రలో చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్(Justice Aparesh Kumar Singh) నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం(High Court Bench) కీ లకమైన తీర్పును వెలువరించింది. సింగిల్ జస్టిస్ జస్టిస్ నగేష్ భీమపాక కేసులో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) దాఖలు చేసిన రిట్‌ను ఇతర రిట్ అప్పీళ్ల(Writ appeals) నుంచి వేరు చేసి, స్వతంత్రంగా విచారించాలని కోర్టు నిర్ణయించింది. గతంలో సింగిల్ జస్టిస్ ఉత్తర్వులు ఒకే వ్యక్తి కమిటీకి అపరిమితమైన అధికారాలను కట్టబెట్టడాన్ని ఈ అ ప్పీల్ ప్రశ్నిస్తోంది.
హైకోర్టులో రిట్ అప్పీళ్లు దాఖలు చేసినప్పటికీ తమ వాదనల ను గ ట్టిగా వినిపించడానికి ముందుకు రాకుండా వెనకడుగు వేస్తున్న కొన్ని హైదరాబాద్ క్రి కెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అనుబంధ క్ల బ్‌ల తీరుపై చీఫ్ జస్టిస్ సింగ్ తీవ్ర అసంతృ ప్తి వ్యక్తం చేశారు. టీసీఏ పిటిషన్‌లోని న్యాయబద్ధతను గుర్తించిన ధర్మాస నం, దాని స్వతంత్ర విచారణ అభ్యర్థనను మన్నించడమే కాకుండా, కీలకమైన చట్టబద్ధమైన నిఘా సంస్థలైన సీఐడీ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెం ట్ విభాగాలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చడానికి అధికారికంగా అనుమతి ఇచ్చింది. సింగిల్ జస్టిస్ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా ఒకే వ్యక్తి కమిటీకి విస్తృతమైన పాలనాపరమైన అధికారాలను కట్టబెట్టారు. ఇది బీసీసీఐ రాజ్యాంగం నిర్దేశించిన తప్పనిసరి నిర్మాణ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉందనీ టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డా.విజయచందర్ రెడ్డి గుర్తు చేశారు.