దివ్యాంగులకు ఉపాధి బాట
* మోతెలో పది రోజుల పాటు ఉచిత శిక్షణ
- 18 నుంచి 50 ఏళ్ల మహిళలు, పురుషులకు అవకాశం
- కేంద్ర ప్రభుత్వ సహకారం.. ఎస్బీఐ నల్లగొండ సౌజన్యం
- స్వయం ఉపాధి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ
- ఆధార్, రేషన్, సదరం సర్టిఫికెట్లతో దరఖాస్తు
మోతె, నవంబర్ 10 (విజయక్రాంతి):- దివ్యాంగులు(Disabilities) ఆర్థికంగా ఎదిగి స్వయం ఉపాధి పొందేలా పల్లెల పరివర్తన సొసైటీ(Rural Transformation Society) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పది రోజుల పాటు ఉచిత వ్యాపార నైపుణ్య శిక్షణ తరగతులు(Free business skills training classes) నిర్వహించనున్నట్లు సొసైటీ చైర్మన్ పల్లెల లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఎస్బీఐ నల్లగొండ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. 18 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు, పురుషులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణకు హాజరయ్యేవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సదరం సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులతో పాటు నాలుగు పాస్పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలని సూచించారు.