డీఆర్‌డీఓలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన గుమ్మడవెల్లి లావణ్య

26-11-2026 | 01:07pm

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన ఆర్యవైశ్య కుటుంబం గుమ్మడవెల్లి సరిత, చంద్రశేఖర్ దంపతుల చిన్న కుమార్తె లావణ్య ప్రభుత్వ ఉద్యోగం సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఈసీఈ (ECE) విభాగంలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న ఆమె, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (Senior Technical Assistant-B) పోస్టుకు నిర్వహించిన పరీక్షకు హాజరైంది. 80 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగానికి ఎంపికైంది.

చిన్నతనం నుంచే కష్టపడి చదువుతూ ప్రతిభ కనబరిచిన లావణ్య, జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్ సీటు సాధించి ప్రస్తుతం చదువుతూనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవడం విశేషం. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న డీఆర్‌డీఓ (Defence Research) సంస్థలో ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. లావణ్య విజయం గ్రామానికి గర్వకారణమని కొనియాడారు.

మరిన్ని వార్తలు