నేర నియంత్రణకు పల్లెల్లో పోలీసుల నిఘా అవసరం
* విలేజ్ పోలీస్ ఆఫీసర్ల పాత్ర కీలకం
* సీసీ కెమెరాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
* గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కోదాడ డీఎస్పీ ఆర్. శ్రీనివాసరెడ్డి
గరిడేపల్లి, నవంబర్ 21 (విజయక్రాంతి): నేరాల నియంత్రణలో(Crime Control) గ్రామస్థాయిలో పోలీసుల అప్రమత్తత, ప్రజల భాగస్వామ్యం కీలకమని కోదాడ డీఎస్పీ ఆర్. శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా(Suryapet District) గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌ను(Garidepally Police Station, ) వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ పరేడ్‌ను తిలకించి సిబ్బంది నుంచి నివేదిక తీసుకున్నారు. గత మూడేళ్ల క్రైమ్ రికార్డులు, కేసు ఫైళ్లు, పోలీస్ సిబ్బందికి సంబంధించిన పరికరాలు, పోలీస్ స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.నేరాల నియంత్రణలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ల (వీపీఓ) పాత్ర కీలకమని, వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లో ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. చదువుకున్న వారు సైతం అధికంగా సైబర్ నేరాల బారిన పడుతున్నారని పేర్కొంటూ, సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పోలీసులు విధుల నిర్వహణలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, ప్రతిరోజూ కనీసం గంట సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలని అన్నారు. విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో హుజూర్నగర్ సీఐ చరమందరాజు, గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్లతో కలిసి డీఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గౌరీశంకర్, పోలీస్ కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.