సెమీ క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన బాప్టిస్ట్ చర్చి
25-11-2026 | 08:30pm
పాస్టర్ రెవరెండ్ డాక్టర్ యేసయ్య
కోదాడ నవంబర్ 25 (విజయక్రాంతి): పట్టణంలోని నయానగర్ లో ఉన్న బాప్టిస్ట్ చర్చి సెమీ క్రిస్మస్(Semi-Christmas) వేడుకలకు ముస్తాబైంది. బుధవారం చర్చి పాస్టర్ రెవరెండ్ డాక్టర్ యేసయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సెమీ క్రిస్మస్ వేడుకల కోసం చర్చిని ముస్తాబు చేసినట్లు తెలిపారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో చర్చిని అలంకరించినట్లు వివరించారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులంతా తప్పకుండా హాజరు కావాలని కోరారు.