ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకి శంకుస్థాపన
నేరేడుచర్ల, అక్టోబర్ 14 (విజయక్రాంతి): నేరేడుచర్ల మండలం పుల్గంబండ తండ గ్రామపంచాయతీ పరిధిలో మంజూరైన 16 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు, గ్రామ సర్పంచ్ బానోతు మంగమ్మ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి(Municipal Chairman Konatham Chinna Venkat Reddy) ముఖ్య అతిథిగా హాజరై, ముగ్గు పోసి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి. లక్ష్మి, ఎంపీఓ ఇ. నాగరాజు, తాళ్ల సురేష్ రెడ్డి, వార్డు సభ్యులు బానోతు రంగమ్మ, బానోతు నాగరాజు, రామావత్ సైదమ్మ, రామావత్ కోటేశ్వరరావు, అంగోతు చిన్ని, ఉపసర్పంచ్ బానోతు మంగ, గ్రామస్తులు రామావత్ శ్రీరాములు, వాల్య, రామావత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో సొంతింటి కల సాకారమవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.