గరిడేపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
అధ్యక్షుడిగా సండ్రపంగు ప్రసాద్.. ప్రధాన కార్యదర్శిగా లకమళ్ల మోజేష్ పాల్
గరిడేపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): గరిడేపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్(Garidepally Mandal Pastors Fellowship) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అబ్బిరెడ్డిగూడెంలోని గెత్సేమనే ప్రేయర్ మినిస్ట్రీస్‌లో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
కమిటీ అధ్యక్షుడిగా సండ్రపంగు ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్. యోహాను, ఉపాధ్యక్షుడిగా దాసరి రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా లకమళ్ల మోజేష్ పాల్, సహాయ కార్యదర్శిగా వీ. షాలేం రాజ్, కోశాధికారిగా మోషే, కన్వీనర్‌గా జేమ్స్, గౌరవ అధ్యక్షులుగా బొడ్డుపల్లి ఏసోబు, గిద్యోను, కమిటీ సభ్యుడిగా పున్నం సీమోను ఎన్నికయ్యారు.సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యెహోషాపాత్, జాన్ పాల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. నూతన కమిటీ మండలంలోని పాస్టర్ల ఐక్యతకు, క్రైస్తవ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సమావేశంలో ఆకాంక్షించారు.