స్వచ్ఛ సర్వేక్షణ్.. రాష్టానికి అవార్డుల పంట
న్యూఢిల్లీ: స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. వివిధ విభాగాల్లో రాష్ట్రానికి మొత్తం ఆరు అవార్డులు దక్కాయి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఏపీ తరఫున మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అవార్డులను అందుకున్నారు.
విశాఖకు అగ్రస్థానం.. విజయవాడకు గుర్తింపు
పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో విశాఖపట్నం జీవీఎంసీ మొదటి ర్యాంకును సాధించింది. జాతీయ స్థాయిలో క్లీన్ సిటీ విభాగంలో విజయవాడకు గుర్తింపు లభించింది. మెంటార్ సిటీ విభాగంలో తిరుపతి, మెంటీ సిటీ విభాగంలో కుప్పం అవార్డులు దక్కించుకున్నాయి.
గుంటూరుకు మూడో స్థానం
మూడు నుంచి పది లక్షల జనాభా కలిగిన నగరాల విభాగంలో గుంటూరు మూడో ర్యాంకును సాధించింది. పారిశుధ్యం, పట్టణ పరిశుభ్రతలో స్థానిక సంస్థలు చేపట్టిన చర్యలకు ఈ గుర్తింపులు లభించాయి. వివిధ కేటగిరీల్లో ఆరు అవార్డులు రావడంతో రాష్ట్రంలో పట్టణ పారిశుధ్య కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహం లభించినట్లయింది.