స్వచ్ఛ సర్వేక్షణ్‌.. హైదరాబాద్‌కు జాతీయ గుర్తింపు

11-11-2026 | 07:25pm

హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26 జాతీయ పురస్కారం(Swachh Survekshan 2025-26 National Award) హైదరాబాద్ నగర పారిశుధ్య విభాగం కృషికి లభించిన గుర్తింపుగా నిలిచింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది, సఫాయి కర్మచారులు, శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ల సేవలకు ఈ అవార్డు గౌరవాన్ని తీసుకొచ్చింది.

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్(HMDA Commissioner Sarfaraz Ahmed) పాల్గొన్నారు.

నగరంలో పారిశుధ్య ప్రమాణాల మెరుగుదల, చెత్త నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ, పరిశుభ్రమైన పరిసరాల కల్పనలో క్షేత్రస్థాయి సిబ్బంది చేస్తున్న కృషికి ఈ పురస్కారం నిదర్శనంగా నిలిచింది. అధికారుల సమన్వయం, పారిశుధ్య కార్మికుల అంకితభావం, ప్రజల భాగస్వామ్యం ఈ విజయానికి కీలకమయ్యాయి.

ఈ గుర్తింపు హైదరాబాద్‌ను మరింత పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన సుస్థిర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని అధికారులు పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్య సాధనలో నగర ప్రజలు ఇదే విధంగా సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు