విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్​ సేవలు చిరస్మరణీయం

11-11-2026 | 07:40pm

జిల్లా కలెక్టర్​ డాక్టర్ సత్య శారద 

వరంగల్​, నవంబర్ 11 (విజయక్రాంతి): విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్​ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(District Collector Dr Satya Sharada) అన్నారు. బుధవారం వరంగల్​ జిల్లా కలెక్టరేట్​లో మైనారిటీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిలో వేడుకలలో ఆజాద్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్ళుర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, స్వాతంత్ర్యం అనంతరం దేశంలో విద్యావ్యవస్థ పటిష్టతకు పునాదులు వేసిన గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, విద్యావంతమైన సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి రమేష్, జిల్లా విద్యాశాఖ అధికారి  ప్రశాంత్ రెడ్డి , ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి శ్రీధర్, సుమన్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు