పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ
చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్
నర్సంపేట, నవంబర్ 11 ( విజయ క్రాంతి ): పట్టణ పరిశుభ్రత(Urban Cleanliness) కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు(Services of sanitation workers) వెలకట్టలేనివని మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు నూతన దుస్తులు, చెప్పులు, ఇతర సామగ్రిని ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ. ఎండ, వాన, చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే వీధులు, డ్రైనేజీలను శుభ్రం చేస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కార్మికుల సంక్షేమం, భద్రతకు మున్సిపాలిటీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, వారికి అవసరమైన రక్షణ పరికరాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, కమిషనర్ కంచర్ల నరేశ్ రెడ్డి, కౌన్సిలర్లు కాంపెల్లి వీణ విజేందర్ రెడ్డి, ముత్తినేని వెంకన్న, బీరం భరత్ రెడ్డి, మాదాసి రవి, పున్నం నరసింహారెడ్డి, ఏపూరి శ్రీనివాస్ రెడ్డి, శ్రీరామోజ్ రోజా రాణి, వేల్పుల శ్రీలత, హన్మకొండ శ్రీధర్, దొంగల రజిత, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కందిక స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.