టీపీటీఎఫ్ నాగల్‌గిద్ద మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

13-11-2026 | 05:03pm

అధ్యక్షుడిగా గుండెరావు పాటిల్.. ప్రధాన కార్యదర్శిగా బండారి రాజు.. జిల్లా కౌన్సిలర్‌గా మురళీకృష్ణ ఎన్నిక

నాగల్‌గిద్ద, నవంబర్ 13 (విజయక్రాంతి): టీపీటీఎఫ్ నాగల్‌గిద్ద(TPTF Nagalgida) మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా శిఖారఖానా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుండెరావు పాటిల్, ప్రధాన కార్యదర్శిగా మావెనల్లి తాండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బండారి రాజు, జిల్లా కౌన్సిలర్‌గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన యం. మురళీకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, రాష్ట్ర కౌన్సిలర్లు భాస్కర్, వెంకట్ రాథోడ్, జోన్ కన్వీనర్లు జి. బాబురావు, మాలోత్ గోవింద్‌తో పాటు టీపీటీఎఫ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు