డ్రగ్స్ రహిత సమాజం - యువతతోనే సాధ్యం

21-11-2026 | 06:35pm

జిల్లా యువజన అధికారి గౌతమ్ రెడ్డి 

నేరేడుచర్ల, నవంబర్ 21(విజయ క్రాంతి): మాదకద్రవ్యాల రహిత సమాజ(Drug-free society) నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని జిల్లా యువజన అధికారి గౌతమ్ రెడ్డి(District Youth Officer Gautam Reddy) పిలుపునిచ్చారు. నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Government Junior College, Nereducherla) మై భారత్ కేంద్రం - సూర్యాపేట(Suryapet) ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి సంబంధించి నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని "నషా ముక్త్ యువ" అనే ఇతివృత్తంతో నిర్వహించారు.ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను స్పష్టంగా ఎంచుకొని, క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు.

యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.ముఖ్య అతిథిగా హాజరైన నేరేడుచర్ల ఎస్ఐ గోపాల్ రెడ్డి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ, తమ హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకోవాలని వివరించారు.

సూర్యాపేట ఎస్పీ కార్యాలయం నుండి వచ్చిన ఎల్లయ్య పోలీస్ కళాబృందం పాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నీరజ,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వనపర్తి శ్రీనివాసులు,కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు