కీతవారిగూడెంలో ఘనంగా పెఱిక కులస్తుల కార్తీక వనభోజనాలు
* సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు,
* ఆటపాటలతో సందడిగా సాగిన వనభోజన వేడుకలు
గరిడేపల్లి, నవంబర్ 22 (విజయక్రాంతి) : మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో(Keethavarigudem Village) పురిగిర క్షత్రియ (పెఱిక) కులస్తుల కార్తీక వనభోజన కార్యక్రమాన్ని గ్రామ పెఱిక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కులస్తులంతా ఒక్కచోట చేరి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.ముందుగా గ్రామంలో కుల సభ్యులతో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం గ్రామ పురోహితులు రాయప్రోలు శ్రీరామయశర్మ ఆధ్వర్యంలో శెట్టి వద్ద ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను కొనసాగించారు. అనంతరం ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తూ వనభోజనాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద సంఘం అధ్యక్షులు గుండు సైదయ్య, ఉపాధ్యక్షులు కీత రామనాథం, ప్రధాన కార్యదర్శి సుందరి సత్యనారాయణ, జుట్టుకొండ వెంకటేశ్వర్లు, బాదే రామకృష్ణ, సుంకర శ్రీనివాస్, యూత్ కమిటీ ఉపాధ్యక్షులు కీత సాయికుమార్, ప్రధాన కార్యదర్శి ముత్తినేని లక్ష్మీనారాయణ, సభ్యులు జుట్టుకొండ రాకేష్, నవీన్, అభిలాష్, మహేష్‌తో పాటు కుల పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.