అంగన్వాడీ, ఆశా వర్కర్లకు బీజేపీ ఘన సన్మానం
ఆలేరు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఆలేరు మండలం(Aleru Mandal)లో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. మంగళవారం ఆలేరు మండల పార్టీ అధ్యక్షుడు పూజారి కుమారస్వామి గౌడ్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కుమ్మరిండ్ల లక్ష్మి, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు శేషత్వం అర్చన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా టంగుటూరు, సాయిగూడెం, మదనపల్లి, కొల్లూరు, షారాజీపేట గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను శాలువాలతో సన్మానించారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంగన్ మిలన్ సేవా కార్యక్రమం ద్వారా అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్ల సేవలను గుర్తించి గౌరవిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జాలపు మమత, పిన్నింటి భాగ్య, భూపెల్లి సంతోష, బి. అండాలు, జె. రాజమణి, కోటగిరి బాలనరసమ్మ, ఎండీ పర్వీన్, ఎలిజబెత్, ఎల్లా పద్మ, ఆశా వర్కర్లు జి. విజయ, బి. లక్ష్మి, గ్యాదపాక లక్ష్మితో పాటు బీజేపీ నాయకులు కటికే వెంకటేష్, ఎస్. అమరేందర్, కళ్లెం యాదగిరి, కాండ్రాజు శ్రీనివాస్, బైరి మహేంద్ర, మంత్రి సాయి ప్రసాద్, ఆయా గ్రామాల బూత్ అధ్యక్షులు వడ్డేపల్లి కిషన్, ఐలి కృష్ణ, గాజుల సారయ్య, గంధం కృష్ణమూర్తి, అజయ్, దిలీప్, నిమ్మల సుధాకర్, రెడ్డి రవీందర్ రెడ్డి, దూడల సిద్ధులు, జూకంటి స్వామి, కొండి అఖిల్ రెడ్డి, చింతకింది భాస్కర్, దూడల ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు.