ఆలేరులో 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం ప్రారంభం..

11-11-2026 | 05:32pm

రైతులకు నిల్వ సౌకర్యం మరింత మెరుగుపడనుంది

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం..

ఆలేరు, నవంబర్ 11 (విజయక్రాంతి): రైతులకు పంట ఉత్పత్తుల నిల్వ సౌకర్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఆలేరు పట్టణంలోని మార్కెట్ యార్డులో 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదామును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(MLA Beerla Ilaiah) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గోదామును ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

పంటలను భద్రపరుచుకోవడానికి గోదాం ఎంతో ఉపయోగపడుతుందని, రైతులకు నిల్వ సదుపాయాలు కల్పించడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఉపేందర్ రెడ్డి, బీజాన బాలమణి, అయినాల చైతన్య, నీలం పద్మ, గంధమల్ల అశోక్, ఎజాజ్, సాగర్ రెడ్డి, సతీష్ రెడ్డి మరియు ముఖ్య నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ డైరెక్టర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, జిల్లా, మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు