ఆదివాసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలి..
* ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి, విద్యుత్తు, సాగు తాగునీటి మౌలిక పనులకు సహకరించాలి...
సిరికొండ/ ఉట్నూర్, నవంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గిరిజన గ్రామాల్లో నివాసముండే ఆదివాసి గిరిజనుల అభివృద్ధి కోసం మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, విద్యుత్, మంచి నీటి, రోడ్డుల సదుపాయాలకోసం అనుమతులు ఇవ్వాలని మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు(Former MP Soyam Bapurao) మారుమూల గిరిజన గ్రామాల ప్రజలతో కలిసి అదిలాబాద్ ఇన్చార్జి డీఎఫ్ఓ నిశాంత్ సుఖ్ దేవ్ బొబడే వినతి పత్రము అందజేశారు.
బుధవారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వాయిపేట్, సాత్ మోరి, లచ్ఛం పూర్, కోసుపటేల్ గూడా తదితర ఆదివాసీ గ్రామాల్లో పటేళ్లు, దేవారిలు, నాయకులతో కలిసి అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని అడవి శాఖ కార్యాలయంలో ఇన్చార్జి డిఎఫ్ఓ ను కలిశారు.
ఈ సందర్భంగా సిరికొండ మండలంతో పాటు ఇంద్రవెల్లి, ఉట్నూర్, తదితర గ్రామాల గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను డీఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లారు. మారుమూల అడవి ప్రాంతంలోని ఆదివాసి గిరిజనులకు అనేక ఇబ్బందులు ఉన్నయాని గ్రామాల్లో కనీసం మౌలిక వసతులైన తాగు సాగు నీరు అలాగే విద్యుత్, సెల్ఫోన్లకు నెట్వర్క్ లేక అనారోగ్యానికి గురైన సమయంలో వైద్యులకు సమాచారం అందించలేకపోతున్నారని, కాలినడకతో ఆసుపత్రికి రావలసి ఉంటుందని సమస్య తీవ్రంగా ఉందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆదివాసులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారన్నారు. సిరికొండ మండలంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికి నెట్వర్క్ లేక ఆపద సమయంలో అంబులెన్స్ కు ఫోన్ చెయ్యాలన్న నెట్వర్క్ లేక ప్రాణాలు కోల్పోతుంన్నారన్నారు. గ్రామాల్లో మంచినీటి కోసం బోర్లు బావులు తవ్వాలన్న అటవీ శాఖ అధికారులు అడ్డుపడడంతో చెరువు నీరు తాగి అనేక రోగాల భారిన పడి మృత్యువాత పడుతున్నామని ఆదివాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ప్రభుత్వం 100 శాతం కొలం గూడల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినప్పటికీ ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో తమకు సొంత ఇంటి కళ నెరవేరడం లేదన్నారు. గ్రామాల్లో ఇప్పటికే ఉన్న బావుల్లోని మట్టిని సైతం తియ్యనియ్యకుండా అటవీ అధికారులు అడ్డుకోవడం సమంజసం కాదని ఇప్పటికైనా ఆదివాసుల సమస్యలను గుర్తించి తాగు నీరు విద్యుత్ అలాగే నెట్వర్క్ కోసం టవర్ నిర్మాణానికి అనుముతులు ఇవ్వాలని విన్నవించారు. మాజీ ఎంపీ సోయం బాపురావు తో పాటు డీసీసీ ఉప అధ్యక్షులు మాధవ్ పటేల్,
సిరికొండ మండల అధ్యక్షులు కంచం లక్ష్మన్,మార్కెట్ డైరక్టర్ చావాన్ ప్రకాష్,లచ్చిపూర్ సర్పంచ్ కుంరం దీపక్, కుంటాగూడ సర్పంచ్ మీరబాయి యాదవ్ రావు,గుమ్మెన సర్పంచ్ కస్తూరి అర్జున్, రాజగోండ్ సేవ సమితి అధ్యక్షులు కుంరం యాదవ్ రావు, ఉప సర్పంచ్ చిక్రమ్ పరమేశ్వర్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోయాం భారీక్ రావు, జంగు, శివాజీ,ఆదివాసీ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.