రాయితీపై రైతులకు శనగ విత్తనాలు

11-11-2026 | 06:09pm

40 శాతం సబ్సిడీతో కిలో రూ.60కే పంపిణీ

కొండపాక, నవంబర్ 11 (విజయక్రాంతి): ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం రాయితీపై శనగ విత్తనాలను అందిస్తోంది. కుకునూరుపల్లి మండల డీసీఎంఎస్ కేంద్రంలో ఎన్ బీజ్ -47 రకం శనగ విత్తనాలు 40 శాతం సబ్సిడీ(Subsidy)పై అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు తెలిపారు.

కిలో విత్తనాల పూర్తి ధర రూ.100 కాగా, రూ.40 రాయితీతో రైతులు రూ.60 చెల్లించాల్సి ఉంటుందని, 25 కిలోల సంచికి రూ.1,500 చెల్లించాలని పేర్కొన్నారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో డీసీఎంఎస్ కేంద్రానికి వచ్చి విత్తనాలు పొందాలని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు