స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిత్య పూజలు...

04-11-2026 | 10:31pm

స్వామివారి నిత్య రాబడి 11,83,767/-

యాదగిరిగుట్ట, నవంబర్ 3 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానం(Yadagirigutta Temple)లో బుదవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామి వారి ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో  గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్ట మూర్తులకు అభిషేకము, అర్చన పండితులు వైభవంగా నిర్వహించారు. ప్రాకారమంటపంలో నృసింహ హోమం, నిత్య కళ్యాణంను నిర్వహించారు. కళ్యాణంలో పాల్గొన్న భక్తులు నరసింహ స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం వెండి జోడు సేవ స్వామివారు తిరువీధులలో ఊరేగారు. శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో స్వయంభు లింగం, స్పటిక లింగంకు భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి నిత్య రాబడి  11,83,767/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు