సాంగ్విలో 8 మందికి కొత్త పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

14-11-2026 | 03:11pm

ఆసరా పెన్షన్లతో లబ్ధిదారుల్లో ఆనందం

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ(Sanghvi Gram Panchayat) పరిధిలో ఎనిమిది మందికి ఆసరా పెన్షన్లు(Asara Pensions) మంజూరు కావడంతో శనివారం లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లలిత, ఉపసర్పంచ్ సుందర్ సింధు మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లను లబ్ధిదారులు(Pension Beneficiaries) సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సీతారాం, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు