తోటపల్లిలో బాలల గ్రామసభ
బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, సంక్షేమంపై చర్చ
బెజ్జంకి,(విజయక్రాంతి): మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సర్పంచ్ కవ్వంపల్లి అశ్విని ఆధ్వర్యంలో బాలల గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల విద్య, ఆరోగ్యం, పోషకాహారం, సంక్షేమం, హక్కులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గ్రామంలోని బాలలు తమ సమస్యలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు అవకాశం కల్పించారు.
బాలల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. బాలల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సర్పంచ్ కవ్వంపల్లి అశ్విని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాంపల్లి శంకర్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.