భవిష్యత్తు కోసం నెహ్రూ ఎంతగానో కృషి
బోథ్,(విజయక్రాంతి): భారతదేశ అభివృద్ధిలో స్వర్గీయ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పాత్ర ఎంతగానో ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్రం అనంతరం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిది అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు విద్యా విజ్ఞాన పారిశ్రామిక రంగాలను అభివృద్ధికి బలమైన పునాదులు వేశారన్నారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఆలపాటి అచ్యుతానంద రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహ దాస్ పీఏసీ సభ్యులు మహమ్మద్ మండల మైనార్టీ అధ్యక్షులు, రహీముద్దీన్, వార్డు సభ్యులు షేక్ షాకీర్, సన్నీ రెడ్డి పద్మారావు తదితరులు పాల్గొన్నారు