ముగిసిన రాష్ట్రస్థాయి 14 ఏళ్ల లోపు సెపక్‌తక్రా పోటీలు

14-11-2026 | 03:31pm

జనగామ,(విజయక్రాంతి): జనగామ(Jangaon) చిన్న క్రీడా మైదానంలో రాష్ట్ర పాఠశాలల 70వ క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన 14 ఏళ్ల లోపు బాలబాలికల సెపక్‌తక్రా పోటీలు(Sepak Takraw Competitions) ముగిశాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి.

విజేతలు బాలికలు: ప్రథమం - వరంగల్, ద్వితీయం - నిజామాబాద్, తృతీయం - మహబూబ్‌నగర్.

బాలురు: ప్రథమం - నల్గొండ, ద్వితీయం - ఆదిలాబాద్, తృతీయం - మహబూబ్‌నగర్ విజేతలకు జనగామ పురపాలక అధ్యక్షులు కడకంచి బాలమణి బహుమతులు అందజేశారు. జాతీయ పోటీలకు ఎంపికైన వారు: బాలురు రిషిగ్యాన్, హరీశ్, గణేష్, ఇమ్మాన్యుయిల్, ప్రణవ్, జేగందర్, రేవంత్‌కుమార్ బాలికలు స్వప్న, శ్రీవిద్య, సాత్విక, త్రివేణి, స్నేహకుమారి, నందిని, రుత్విక, రిషిత ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి నరసింహ రావు, విద్యా శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్, పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి గోర్ సింగ్, సెపక్‌తక్రా రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు