పాఠశాలలో సమస్యలుంటే తెలపండి

14-11-2026 | 03:33pm

బోథ్,(విజయక్రాంతి): మీ పాఠశాలలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కరత్వాడగ్రామ సర్పంచ్ విశ్వేశ్వరరావు కోరారు. బాలల దినోత్సవాన్ని(Children's Day) పురస్కరించుకొని గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన బాలల గ్రామసభ(Childrens Gram Sabha) ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. భవిష్యత్తులో ఉన్నతులుగా ఎదుగుతామని పిల్లలు ప్రతిజ్ఞ చేశారు. ఇబ్బందులు ఉంటే స్వేచ్ఛగా చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపాధ్యాయులు కిషోర్ ఏఎన్ఎం శశికళ వార్డు సభ్యులు దేశం భీమలింగు గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు