గంజాయి నిందితుడు అరెస్టు, రిమాండ్

18-11-2026 | 06:19pm

22 గ్రాముల గంజాయి స్వాధీనం.

బేల బస్టాండ్ సమీపంలో తనిఖీలలో లభ్యమైన గంజాయి.

గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి.

జైనథ్ సిఐ జి శ్రావణ్

బేల నవంబర్ 18(విజయక్రాంతి): బేల మండల(Bela Mandal) కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గంజాయి(ganja) తరలిస్తుండగా అనుమానస్పదంతో తనిఖీలు(Inspections) నిర్వహించగా నిందితుడు బాది గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ వద్ద 22 గ్రాముల గంజాయి లభ్యమైనట్టు, ఇతనిపై బేల పోలీస్ స్టేషన్లో(Bela Police Stations) కేసు నమోదు(case registered) చేసి న్యాయస్థానం అనుమతితో ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు జైనథ్ సిఐ జి శ్రావణ్ తెలిపారు.

గంజాయి తాగిన సేవించిన వ్యాపారం చేసిన పండించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి ప్రజలు ప్రతి ఒక్కరు యువత ముందుండి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మధు కృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు