మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

18-11-2026 | 06:48pm

కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి

 జీవో ఆర్టీ నంబర్ 1181ని రద్దు చేయాలి

 సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో ధర్నా.

కొత్తగూడెం : టౌన్ నవంబర్ 18 (విజయక్రాంతి): మున్సిపల్ కార్మికులందరినీ(Municipal workers) వెంటనే పర్మినెంట్ చేయాలని, పర్మినెంట్ చేసేంతవరకు రూ.26 వేల కనీస వేతనం అమలు(Implementation of minimum wage) చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా(CPI District Secretary SK Sabir Pasha) డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం(Kothagudem Municipal Corporation Office) ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ(State Finance Department) విడుదల చేసిన జీవో ఆర్టీ నంబర్ 1181ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. పాలకులు కార్మికుల న్యాయమైన డిమాండ్లను విస్మరిస్తే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.   

 కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి

కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇవ్వాలి

 ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలి

యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె ఏసురత్నం

ధర్నాను ఉద్దేశించి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె ఏసురత్నం మాట్లాడుతూ కాంట్రాక్టు విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, కార్మికులందరికీ నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారానే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులందరినీ కేటగిరీల వారీగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నెలంతా కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.   

 రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలివ్వాలి

కుటుంబంలో ఒకరికి వారసత్వ ఉద్యోగమివ్వాలి

దహన సంస్కారాలకు రూ.30 వేలు చెల్లించాలి

యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి

యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన కార్మికులకు రూ.10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ అందించాలని డిమాండ్ చేశారు. మరణించిన మరియు 60 ఏళ్ల వయోపరిమితి నిండిన కార్మికుల కుటుంబంలో ఒకరికి వారసత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో లేదా అనారోగ్యంతో కార్మికులు మృతి చెందితే దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ.30 వేలు తక్షణ సాయంగా ఇవ్వాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గెద్దాడు నగేష్, జిల్లా నాయకులూ భూక్య శ్రీనివాస్, కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, గుర్రం వెంకటేశ్వర్లు, కూరపాటి సుధాకర్, నాయకులు భవాని, సాంబిరెడ్డి, దినేష్, పండు, కార్మికులు నవీన్, లక్ష్మణ్, వెంకటమ్మ, ఆదిలక్ష్మి, ధన్రాజ్, శైలు, సురేష్, శ్రావణ్, గాయత్రి, గౌస్, సుశీల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు