విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై అవగాహన

18-11-2026 | 06:48pm

నేరేడుచర్ల, నవంబర్ 18(విజయ క్రాంతి): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School) నేరేడుచర్లలో బుధవారం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre) వైద్యాధికారి డాక్టర్‌ పి.నాగిని డ్రైవ్‌ను సందర్శించి విద్యార్థినులకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు.14 ఏండ్లు నిండి 15 ఏండ్ల వరకు గల బాలికలకు వ్యాక్సినేషన్‌ ఇస్తున్నట్లు తెలిపారు.

నవంబర్‌ 2011 నుంచి నవంబర్‌ 2012 మధ్య జన్మించిన బాలికలకు వ్యాక్సిన్‌ అందిస్తున్నామన్నారు. ఈ వ్యాక్సిన్‌ వల్ల గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చని, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని వివరించారు.ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, వైద్య సిబ్బంది జి.సునీత, జి.ఎం. నరసయ్య, ఆశాలు వి.గురువమ్మ, ఇ.సునీత, ఎన్‌.యశోద, కె.రాజ్యం, కె.విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు