బండ్ల గణేష్‌కు కోర్టు షాక్.. ఏడాది జైలు శిక్ష

18-11-2026 | 06:48pm

అమరావతి: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌(Tollywood Producer Bandla Ganesh)కు న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసు(Cheque Bounce Case)లో ఒంగోలు కోర్టు ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని, ఫిర్యాదుదారుడి న్యాయపరమైన ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆర్థిక లావాదేవీల(Financial transactions)కు సంబంధించి గుంటూరు జిల్లాకు చెందిన జెట్టి వెంకటేశ్వరరావుతో బండ్ల గణేష్‌కు వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్(Parameshwara Art Productions) పేరుతో రూ.95 లక్షల విలువైన చెక్కును ఆయన జారీ చేశారు. అయితే బ్యాంకు ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో ఆ చెక్కు చెల్లలేదు. దీంతో బాధితుడు న్యాయం కోసం ఒంగోలు కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన ఆధారాలను పరిశీలించింది. అనంతరం బండ్ల గణేష్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. రూ.95 లక్షల జరిమానాతో పాటు బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది.

తాజా తీర్పుతో బండ్ల గణేష్(Bandla Ganesh) తదుపరి న్యాయపరమైన చర్యలపై ఆసక్తి నెలకొంది. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. గతంలోనూ చెక్ బౌన్స్ వివాదాల్లో ఆయన న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజా తీర్పు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు