ప్రతాప్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదు
గజ్వేల్, నవంబర్ 18: గజ్వేల్ నియోజకవర్గంలో(Gajwel Constituency) నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఆపదలో అండగా నిలిచే నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి(Vanteru Pratap Reddy) అని బీఆర్ఎస్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్(BRS Gajwel-Pragnapur Municipality) నాయకులు బొగ్గుల సురేష్, గంగిశెట్టి రవీందర్ అన్నారు. ప్రతాప్ రెడ్డిపై కొట్టాల యాదగిరి చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ప్రతాప్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు యాదగిరికి లేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. స్వప్రయోజనాల కోసం కులాన్ని, రాజకీయాలను ఉపయోగించుకుంటూ ప్యాకేజీల కోసం పార్టీలు మారుతున్నారని ఆరోపించారు.
గతంలో బీఆర్ఎస్లోకి తిరిగి రావడానికి ప్రతాప్ రెడ్డి సహాయం కోరిన విషయాన్ని మరిచిపోయావా అంటూ ప్రశ్నించారు. కవిత(Kavitha) స్థాపించిన తెలంగాణ రక్షణ సేవా సమితిలో(telangana rakshana sena) చేరి ప్రతాప్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజాసేవ చేసి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ప్రతాప్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోట బాబు, మామిడి శ్రీధర్, నాయకులు మన్నె వెంకటేష్, కప్ప పోచయ్య, మరికంటి కనకసేన, చీర్ల మల్లేష్ యాదవ్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.