రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలకు కస్తూర్బా విద్యార్థులు ఎంపిక

18-11-2026 | 06:51pm

నాగిరెడ్డిపేట్, నవంబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలకు(State-level touch rugby competitions) నాగిరెడ్డిపేట్ కేజీబీపీ విద్యార్థుల(KGBP students) ప్రతిభ చాటినట్లు కస్తూర్బా పాఠశాల(Kasturba School) ప్రిన్సిపల్ గీత తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించినటువంటి టచ్ రగ్బీ జిల్లాస్థాయి రగ్బీ టీం సెలక్షన్స్లో అండర్ 14 విభాగంలో స్రవంతి రవళి ఎంపికయ్యారు.అలాగే అండర్ 17 విభాగంలో జోష్ణ మరియు యుక్తేశ్వరి ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.కరీంనగర్ హుజరాబాద్లో 20,21,22 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పిటి శోభా తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులను  ప్రిన్సిపాల్ గీత,ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు