విద్యార్థుల్లో ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై చైతన్యం పెంచాలి

18-11-2026 | 06:44pm

అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్.

మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల్లో(students) ఓటు హక్కు(Right to vote) ప్రాముఖ్యత, ఎన్నికల ప్రక్రియ(Election process), ప్రజాస్వామ్య విలువలపై(democratic values) అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్(Additional Collector Anil Kumar) అన్నారు. భారత ఎన్నికల సంఘం(Election Commission of India) ఆదేశాల మేరకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల(Electoral Literacy Club) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్  కార్యాలయ ఎన్ ఐ సి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు, జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరిష్ ఆదేశాల ప్రకారం  ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి విద్యార్థి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బాధ్యతాయుత పౌరులుగా ఎదగడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఓటు హక్కు ప్రాధాన్యత అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా, ఓటరు జాబితా తయారీ, సవరణలు, ఈవీఎంలు, వీవీప్యాట్, పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై క్విజ్ పోటీల ద్వారా విద్యార్థుల అవగాహనను పరీక్షించారు.

విద్యార్థులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులోనూ ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ద్వారా ఎన్నికల అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్ యాదవ్, సంబంధిత  ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు