అర్హులందరికీ సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
నాలుగు మండలాల్లో నూతన పింఛన్ల పంపిణీ
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
కామారెడ్డి, నవంబర్ 18 (విజయక్రాంతి): అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Government welfare schemes) అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) అన్నారు. బుధవారం కామారెడ్డి నియోజకవర్గంలోని(Kamareddy constituency) మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బిబిపేట్ మండలాల్లో నిర్వహించిన నూతన పింఛన్ల మంజూరు(Sanction of new pensions) పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు(Beneficiaries) పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.మాచారెడ్డి చౌరస్తా వద్ద ఉన్న రైతు వేదికలో, పాల్వంచ రైతు వేదికలో, దోమకొండ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో, బిబిపేట్ రైతు వేదిక ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, రైతులు, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా గౌరవంగా జీవించేందుకు పింఛన్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రమేష్ గౌడ్, నౌశిలాల్, గణేష్ నాయక్, సుతారి రమేష్, ఇంద్రసేనారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.