చెకుముకి పరీక్ష.. విద్యార్థుల్లో సైన్స్ జోష్

21-11-2026 | 06:25pm

బోథ్, నవంబర్ 21 (విజయక్రాంతి): విద్యార్థుల్లో చిన్నతనం నుంచే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని (Scientific Thinking) అలవర్చాలనే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక (Jana Vignana Vedika) ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ (Science Talent Test) నిర్వహించారు. బోథ్‌లోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఈ పరీక్షలు జరిగాయి.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గజపల్లి నరసయ్య, జన విజ్ఞాన వేదిక బాధ్యుడు బైరి సతీష్ ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏటా మండల, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. బోథ్ మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు