వెంకన్నకు కళ్లు చెదిరే బంగారు కానుక

21-11-2026 | 06:51pm

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ బంగారు కానుక సమర్పించేందుకు సిద్ధమయ్యారు. సుమారు 121 కిలోల బరువున్న బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించనున్నట్లు సమాచారం. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని అంచనా టీటీడీ అధికారులు అంచన వేస్తున్నారు.

ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో దాత ఈ ఆభరణాలను టీటీడీకి అందజేయనున్నారు. స్వామివారి అలంకరణ, నిత్య కైంకర్యాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 45 రకాల ఆభరణాలను కానుకగా ఇవ్వనున్నట్లు సమాచారం. భక్తితో స్వామివారికి సమర్పిస్తున్న ఈ భారీ కానుక తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ విరాళం అందితే తిరుమల చరిత్రలో శ్రీవారి ఆలయానికి అందితే అతిపెద్ద కానుక ఇదే అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు