ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కు పంపిణీ

15-10-2026 | 04:07pm

బోథ్. అక్టోబర్ 15 ( విజయ క్రాంతి) ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును కౌట(బి)(Chief Minister's Relief Fund cheque) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి 24 వేల రూపాయల విలువైన చెక్కును అందించారు. బోత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ ఆదేశాల మేరకు ఈ చెక్కును అందించడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సున్నపు శ్రీనివాస్ పిఏసి కమిటీ మెంబర్ ఇత్తిడి రాజు రెడ్డి సీనియర్ నాయకులు ఇట్టెడి రవి రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చిలకడి రవీందర్, ఇయ్యాల శ్రీధర్ రెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు