రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన

04-11-2026 | 05:50pm

పలిమేల, నవంబర్ 4 (విజయక్రాంతి): పలిమెల మండలం పంకెన గ్రామంలో వ్యవసాయ శాఖ(Department of Agriculture) ఆధ్వర్యంలో ఆత్మసంస్థ సహకారంతో రైతులకు వివిధ రకాల యాజమాన్య పద్ధతులపై అవగహన కలపించారు. వ్యవసాయశాఖ అధికారుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా పంకెన గ్రామంలో క్షేత్ర ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి ఎ సంపత్ మాట్లాడుతూ సూడోమానస్ ఫ్లోరీసెన్స్ మేలు జాతి బాక్టీరియతో కూడిన జీవనరసాయనము వాడడం వలన మొక్కలు రోగనిరోధక శక్తి పెంచుకొని తెగుళ్లను సమర్తవంతంగా తట్టుకుంటుందని తెలిపారు.

రైతులు సాధారణ యూరియా మరియు డిఏపి 25 శాతం తగ్గించి నానో యూరియా, నానో డిఏపి వాడడం పంట దిగుబడి 4 నుంచి 10 శాతం పెరుగుంతుందనీ మరియు పెట్టుబడి ఖర్చు తగ్గుతందని  తెలిపారు. రైతులకు సూడోమానస్ ఫ్లోరీసెన్స్ 1 కేజీ పాకెట్స్ అందుబాటులో ఉన్నాయని కావాల్సిన వారు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో పంకెన సర్పంచ్ పాగె వైకుంఠం, వ్యవసాయ విస్తరణ అధికారి జి. శరత్ ,రైతులు కమ్మల తిరుపతి, కమ్మల రాజేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు