తుంగతుర్తిలో 2000 కోట్లతో అభివృద్ధి పనులు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, అధికారులదే కీలక పాత్ర..
తుంగతుర్తి, (విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గంలో సుమారు 2000 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో స్థానిక సర్పంచులు అధికారులదే కీలకపాత్ర అని, ప్రభుత్వం నుండి మంజూరు అవుతున్న నిధులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు.
గ్రామాల అభివృద్ధిలో రోడ్లు, త్రాగునీరు విద్యుత్, డ్రైనేజీ పనులు ముఖ్యమని, తెలియజేస్తూ తుంగతుర్తి నుంచి రావులపల్లి రోడ్డు వరకు నూతన ఆర్ అండ్ బి రోడ్లను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు. తుంగతుర్తి సర్కిల్ పరిధిలోని, పంచాయతీరాజ్ రోడ్ల పనులపై డిఈ లింగ నాయక్ నిర్లక్ష్యంపై, సభలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనిచేయడం ఇష్టం లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరారు.
మండలంలో 329 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, ప్రతి గ్రామంలో అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి అందజేయాలని, సంబంధిత డీఈ కోరుతూ, ప్రస్తుత ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో సుమారు 500 పైచిలుకు గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నందున, మద్యానికి బానిసై, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, తక్షణమే వాటిపై చర్య తీసుకోవాలని ఎక్సైజ్ సిఐని కోరారు. తుంగతుర్తి మండలం లో ఉన్న ప్రభుత్వ భూముల పై పూర్తి నివేదిక నివ్వాలని తాసిల్దార్ దయానందమును కోరారు.
రానున్న రోజుల్లో సుమారు వెయ్యి మంది పైగా విద్యార్థులకు గాను, ఉచిత విద్యా, వసతి, బోధనతో ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రారంభం కానున్నట్లు, పేద విద్యార్థులకు మంచి విద్యాబోధన, ఏరియా దవాఖాన అందుబాటులోకి వస్తే, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అంద ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్నీ ఓ ప్రభావంతో సాగు త్రాగునీరు విద్యుత్ సమస్య రానున్నట్లు రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని ప్రత్యేకంగా కోరారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు,మండల కేంద్రాల్లో నివాసం ఉండి, గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండాలని కోరారు.
సర్వసభ్య సమావేశానికి హాజరైన ప్రతి అధికారితో, మమేకమై సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ, ఎమ్మెల్యే తనదైన శైలిలో చమత్కరించారు. సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టిన అధికారులపై, శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సర్పంచులను, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ దయానందం, ఎంపీడీవో చలపతి, పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు రేగటి రవి గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, పాల్గొన్నారు.