ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా
నియోజకవర్గ ఇన్చార్జి.
బోథ్. నవంబర్ 29 (విజయక్రాంతి): వివిధ గ్రామాలలో నెలకొన్న ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్(Congress Party Constituency In-charge Ade Gajender) పేర్కొన్నారు బజారత్నూర్ మండలంలోని(Bazarthnur Mandal) గ్రామంలో శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆదివారం గ్రామస్తులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నామన్నారు. గ్రామాలలో నెలకొన్న మౌలిక వసతులతో పాటు వ్యక్తిగత సమస్యలను సైతం అధికార యంత్రాంగం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తో పాటు మండల పార్టీ కన్వీనర్ కళ్లెం విట్టల్నాయకులు పాల్గొన్నారు.