వాగ్దేవి విద్యాలయంలో ఉత్సాహంగా మన్ కీ బాత్ వీక్షణం

29-11-2026 | 05:18pm

చెన్నూర్,( విజయక్రాంతి ) : మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో(Kishtampet Village) గల వాగ్దేవి విద్యాలయం(Vagdevi Vidyalayam)-140లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) నిర్వహించిన ‘మన్ కీ బాత్(Mann Ki Baat)’ కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా వీక్షించారు. దేశాభివృద్ధి, జాతి నిర్మాణం, యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి అంశాలపై ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ చెన్నూర్ మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్ గౌడ్, వాగ్దేవి విద్యాలయం కరస్పాండెంట్ బొమ్మ జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావాలు, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు