అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలి

29-11-2026 | 05:20pm

ఏఎస్‌డీడీ జాబితాలపై పోలింగ్‌ బూత్‌ స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేపట్టాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి

మంథని లో ఓట్ బచావో – దేశ్ బచావో ఫేజ్-3 ఓట్ రక్షక్ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

మంథని, నవంబర్ 29(విజయక్రాంతి): అర్హులైన ఓటర్ల పేర్లు ఓటరు జాబితా(Voter List) నుంచి తొలగిపోకుండా బూత్ స్థాయిలో ఏఎస్‌డీడీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్(Raj Thakur) సూచించారు. ఆదివారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుతో(Duddilla Srinubabu) కలిసి నిర్వహించిన సర్ ఫేజ్-3 బీఎల్ఏల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ప్రజల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా వివరించాలని సూచించారు.

ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఎంతో విలువైనదని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా బీఎల్ఏలు, వాలంటీర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఐ యామ్ ఓట్ రక్షక్' కార్యక్రమంపై ప్రతి బూత్ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా, అసత్య ఆరోపణలు చేసినా వాటిని పట్టించుకోకుండా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే సమాధానంగా నిలవాలని పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు తాను ఎల్లప్పుడూ ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు), వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు