మంథని–మల్లేపల్లి శివారులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

29-11-2026 | 05:13pm

జూనియర్ కళాశాల సమీపంలోని పత్తి చేనులో మృతదేహం గుర్తింపు

మంథని, నవంబర్ 29(విజయ క్రాంతి): మంథని పట్టణ(Manthani town) సమీపంలోని మల్లేపల్లి శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. మంథని–గోదావరిఖని ప్రధాన రహదారిపై(Manthani–Godavarikhani Main Road) జూనియర్ కళాశాల(Junior College) సమీపంలోని పత్తి చేనులో మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు